Pushpa Movie Making Video: 'పుష్ప' మేకింగ్‌ వీడియో వైరల్‌.. బన్నీ మెసేజ్‌ సూపర్‌

5 Dec, 2021 16:07 IST|Sakshi

Pushpa Movie Making Video Released And Goes Viral: ఫేవరెట్‌ హీరో సినిమాను ఫస్ట్‌ డే, ఫస్ట్‌ షో చూస్తే ఎంత కిక్కు వస్తుంది. అది చూసి హీరో ఎలివేషన్, యాక్టింగ్‌, యాక్షన్‌ సీన్స్‌, రొమాన్స్‌ అందరికంటే ముందు చెప్తే ఆ హాయి మాములుగా ఉండదు. అలాగే సినీ ప్రియులకు సినిమా మేకింగ్‌ చూసినా అంతకు డబుల్‌ కిక్‌ వస్తుంది. అందుకే సినిమా అయిపోయాక టైటిల్‌ క్రెడిట్స్‌ పడేటప్పుడు సినిమా మేకింగ్‌ వీడియో చూపిస్తే 'అబ్బా సాయిరాం' అనిపిస్తుంటుంది. అలాగే సినిమా మేకింగ్‌ వీడియోస్‌ లీకైనా, మేకర్సే రిలీజ్‌ చేసిన చూసి తరిస్తాం. ఇది అర్థం చేసుకున్నారో ఏమో గానీ 'పుష్ప' చిత్ర బృందం ఆ సినిమా చిత్రీకరణ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పంచుకుంది. 

ఈ వీడియోలో 'మనం ఈ లొకేషన్‌ నుంచి ఖాళీ చేసి వెళ్లేలోపు ఇక్కడున్న ప్లాస్టిక్‌ సామాను, చెత్త చెదారం అంతా క్లీన్‌ చేసి నీట్‌గా ఉంచాలి' అని అల్లు అర్జున్‌ చిత్ర బృందానికి చెప్పడం కనిపిస్తుంది. తర్వాత సినిమాను చిత్రీకరించే వివిధ లొకేషన్స్‌లో టీమ్‌ పడిన కష్టాన్ని వీడియోలో చూపించారు. మొబైల్‌తో చిత్రీకరించిన ఈ మేకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్‌'. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 17న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా సోమవారం (డిసెంబర్‌ 6)న ఈ  సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 

ఇదీ చదవండి: ఇక్కడ ప్రభాస్‌..అక్కడ సల్మాన్‌.. బన్నీకి సపోర్ట్‌గా ఆ ఇద్దరు!

మరిన్ని వార్తలు