అల్లు అర్జున్‌ను కాపీ కొట్టిన సల్మాన్‌.. అచ్చం అవే స్టెప్పులు!

22 Apr, 2021 16:00 IST|Sakshi

సల్మాన్‌ ‘రాధే’ ట్రైలర్‌ విడుదల

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధే. గతేడాది విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది.  ఎట్టకేలకు ఈ రంజాన్‌ కానుకగా మే 13న రాధే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లతోపాటు ఓటీటీలోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇక సినిమాలో తనకు నచ్చినట్లు వ్యవహరించే రౌడీ పోలీస్‌ పాత్రలో సల్మాన్‌ కనిపించనున్నాడు. దిశాపటాని హీరోయిన్‌గా కనిపించనుంది. రణదీప్‌ హుడా పవర్‌ఫుల్‌ విలన్‌గా సల్మాన్‌ను ఢీ కొట్టనున్నాడు. తాజాగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ గురువారం రిలిజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌లో చేజింగ్‌లు, భారీ యాక్షన్‌ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. 

డ్రగ్స్ మాఫియాను అంతం చేసే పోలీస్ ఆఫీసర్ స్టోరీని ప్రభుదేవా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. అయితే ట్రైలర్‌పై టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలోని సీటీమార్‌ పాటను రాధే చిత్రయూనిట్‌ కాపీ కొట్టిందని మండిపడుతున్నారు. సల్మాన్‌, దిశా కనిపించే ఓ పాటలో పూర్తిగా బన్నీ స్టైల్లో భాయ్‌జాన్‌ స్టెప్పులు వేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బన్నీని కాపీ కొట్టిన సల్మాన్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక అల్లు అర్జున్‌ స్టెప్పులను సల్మాన్‌ కాపీ కొట్టారంటే మన హీరో రేంజ్ వేరు అని బన్నీ అభిమానులు మురిసిపోతున్నారు.

చదవండి: సెల్ఫీ అన్నాడు.. ఏకంగా ముద్దే పెట్టేశాడు
అ‍ల్లు అర్జున్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన దిల్‌ రాజు!

మరిన్ని వార్తలు