Rahul Sipligunj : రాహుల్‌ హీరోగా 'రంగమార్తాండ'.. లిరికల్‌ సాంగ్‌ చూశారా?

14 Mar, 2023 09:32 IST|Sakshi

సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం రంగమార్తాండ.కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్‌కు జోడీగా శివాత్మిక రాజశేఖర్‌ హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ షురూ చేసిన మూవీ టీం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ‘పొదల పొదల గట్ల నడుమ లగోరంగ లగోరే..పొడుస్తుంటే చందమామ లగోరంగ లగోరే’ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేసింది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. రాహుల్ సిప్లి గంజ్ ఈ పాటను ఆలపించాడు.  

మరిన్ని వార్తలు