Raj Kundra: రెండు నెలల తర్వాత బెయిల్‌..కన్నీళ్లతో అవమానంగా

21 Sep, 2021 20:12 IST|Sakshi

Raj Kundra Was Planning To Sell Adult Videos For Rs 9 Crores: నీలి చిత్రాల కేసులో అరెస్టయిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా జైలు జీవితం గడిపిన ఆయన నేడు (మంగళవారం) విడుదలై బయటకు వచ్చారు. ​ఈ క్రమంలో ఇంటికి వెళ్లేముందు రాజ్‌కుంద్రా కళ్లలో నీళ్లు తిరిగాయి. తప్పు చేశానన్న అపరాధ భావం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది.

చదవండి : రాజ్‌కుంద్రాకు బెయిల్‌: భర్తతో శిల్పా విడిపోతుందా?
ఇదిలా ఉండగా.. రాజ్‌కుంద్రా గురించి ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు షాకింగ్‌ నిజాలు బయటపెట్టారు. విచారణలో భాగంగా కుంద్రా మొభైల్‌, లాప్‌టాప్‌, హార్డ్ డ్రైవ్ లను పరిశీలించామని, అందులో 119 నీలి చిత్రాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ వీడియోలను కుంద్రా రూ.9 కోట్లకు బేరానికి కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా ఫిబ్రవరిలో ముంబై శివారులోని ఓ బంగ్లాలో పోర్న్‌ మూవీ షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి అక్కడున్న 11మందిని అరెస్ట్‌ చేశారు.

ఐదు నెలల పాటు దర్యాప్తు అనంతరం పోర్న్‌ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. ఇందులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా హస్తం ఉందన్న ఆరోపణలతో జులై 19వ తేదీన ముంబై పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జైలు నుంచి విడుదలైన కుంద్రాతో శిల్పా వైవాహిక జీవితం ఎటువైపు టర్న్‌ తీసుకుంటుందో చూడాల్సి ఉంది.


చదవండివచ్చే నెలలో నిశ్చితార్థం: కారు ప్రమాదంలో నటి మృతి

మరిన్ని వార్తలు