రజనీ సినిమాలో రణ్‌వీర్‌?

18 Dec, 2023 01:18 IST|Sakshi

రజనీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది వేసవిలోప్రారంభం కానుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ బాలీవుడ్‌ స్టార్స్‌ షారుక్‌ఖాన్, రణ్‌వీర్‌ సింగ్‌లను సంప్రదించారట.

అయితే ఇటీవల కాలంలో ఇతర చిత్రాల్లో ఎక్కువగా గెస్ట్‌ రోల్స్‌ చేసిన కారణంతో రజనీ సినిమాకు షారుక్‌ సున్నితంగా నో చెప్పారని, దీంతో రణ్‌వీర్‌సింగ్‌ను లోకేష్‌ కలిసి కథ వినిపించారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మరి...  రజనీకాంత్‌ సినిమాలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. మరోవైపు రజనీకాంత్‌ ప్రస్తుతం ‘వేట్టయాన్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే రజనీకాంత్‌ ఓ లీడ్‌ రోల్‌ చేసిన ‘లాల్‌ సలామ్‌’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
 

>
మరిన్ని వార్తలు