రవితేజ మిస్టర్‌ బచ్చన్‌

18 Dec, 2023 00:50 IST|Sakshi

హీరో రవితేజ, దర్శకుడు హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా సినిమాకు ‘మిస్టర్‌ బచ్చన్‌’ టైటిల్‌ ఖరారైంది.‘నామ్‌ తో సునా హోగా..!’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ సినిమాప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి కె. రఘురామకృష్ణ, టీజీ భరత్‌లు కలిసి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, మంగత్‌ పాఠక్‌ క్లాప్‌ ఇచ్చారు.  ముహూర్తపు షాట్‌కు ‘‘మిస్టర్‌ బచ్చన్‌... నామ్‌ తో సునా హోగా!’’ అని రవితేజ డైలాగ్‌ చెప్పగా, వీవీ వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. రవితేజ, విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల, రఘురామకృష్ణలు కలిసి హరీష్‌ శంకర్‌కు ఈ సినిమా స్క్రిప్ట్‌ను అందించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్, సహ–నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

>
మరిన్ని వార్తలు