-
ప్రభుదేవా హిట్ సినిమా 'ప్రేమికుడు' రీ-రిలీజ్
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ- రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా సాంగ్స్ ఉన్నాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్‌కు అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు. -
మమ్మీ తిరిగొస్తోంది
హాలీవుడ్ హారర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది మమ్మీ’ రీ రిలీజ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. స్టీఫెన్ సోమర్స్ దర్శకత్వంలో 1999లో విడుదలైన ‘ది మమ్మీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ యాక్షన్ అడ్వెంచరస్ హారర్ ఫిల్మ్‌లో బ్రెండెన్ ఫ్రేజర్, రాచెల్ వీజ్, జాన్ హాన్యా, ఆర్నాల్డ్ వోస్లూ, జోనాథన్ హైడ్ లీడ్ రోల్స్‌లో నటించారు. జేమ్స్ జాక్స్, సీన్ డేనియల్ నిర్మించిన ‘ది మమ్మీ’ సినిమాను 1999 మే 7న యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంగా ఏప్రిల్ 26న థియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నట్లుగా యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. -
మళ్లీ హ్యాపీ డేస్
కాలేజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రాల్లో ‘హ్యాపీ డేస్’ (2007) ఓ ట్రెండ్ సెట్టర్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్‌ఫుల్ చిత్రం విడుదలై పదిహేడేళ్లయింది. వరుణ్ సందేశ్, తమన్నా భాటియా, నిఖిల్ సిద్ధార్థ్ తదితరుల కాంబినేషన్లో అమిగోస్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో మంచి వసూళ్లతో సంచలన విజయం సాధించింది. శేఖర్ కమ్ముల టేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్, మిక్కీ జే మేయర్ సంగీతం, విజయ్ సి. కుమార్ కెమెరా పనితనం అన్నీ అద్భుతంగా కుదిరిన ఈ చిత్రం ఇప్పుడు మళ్లీ విడుదల కానుంది. ఏప్రిల్ 12న ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ సినిమాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రీరిలీజ్‌కు రెడీ అవుతోన్న సూపర్ హిట్ లవ్ స్టోరీ
ప్రేక్షక్షుల ముందుకు మరోసారి వచ్చేందుకు ప్రేమికుడు సిద్ధం అవుతున్నాడు. ప్రభుదేవా హీరోగా, నగ్మా హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘ప్రేమికుడు’(తమిళంలో ‘కాదలన్’). శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘ముక్కాలా ముక్కాబులా’, ‘ఊర్వశి ఊర్వశి’, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’, ‘అందమైన ప్రేమరాణి’.. వంటి పాటలన్నీ యువతను ఉర్రూతలూగించాయి. క్లాసిక్ హిట్‌గా రూపొందిన ‘ప్రేమికుడు’ తెలుగులో రీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. తెలుగు రీ రిలీజ్ హక్కులను నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ దక్కించుకున్నారు. సీఎల్ఎన్ మీడియా ద్వారా త్వరలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. -
మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్లో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకడు. లవ్ స్టోరీలతో చాలా తక్కువ టైమ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన ఇతడు.. ఆ తర్వాత సరైన ఛాన్సుల్లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతడి పుట్టినరోజు లేదా వర్థంతి సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి జనరేషన్ కోసం ఉదయ్ కిరణ్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఇతడి కల్ట్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?) ఉదయ్ కిరణ్, అనిత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'నువ్వు నేను'. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సునీల్ కామెడీ టైమింగ్, ఆర్పీ పట్నాయక్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రచ్చ లేపాయని చెప్పొచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా 2001 ఆగస్టు 10న రిలీజైంది. తొలి ఆట నుంచే సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పట్లో అద్భతమైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాని తిరిగి థియేటర్లలో ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. ఈ మార్చి 21న బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఒకవేళ ఉదయ్ కిరణ్ స్క్రీన్ మ్యాజిక్ చూడాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కాకండి. (ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement