శర్వానంద్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మెగా హీరో..

6 Mar, 2021 11:17 IST|Sakshi

బర్త్‌ డే సందర్బంగా కేక్‌ కట్‌ చేయించిన రామ్‌ చరణ్‌

హీరో శర్వానంద్‌ పుట్టిన రోజు నేడు. శనివారం 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్న బర్త్‌ డే బాయ్‌ శర్వాకి ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు, స్నేహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బర్త్‌డే సందర్భంగా శర్వానంద్‌కి ఊహించని సర్‌ప్రైజ్‌ ఎదురయ్యింది. తన బెస్ట్‌ ఫ్రెండ్‌.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, శర్వానంద్‌కు మర్చిపోలేని పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అర్థరాత్రి బర్త్‌ డే పార్టీ ఏర్పాటు చేసి శర్వానంద్‌ చేత కేక్‌ కట్‌ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీనిలో శర్వానంద్..‌ రామ్‌ చరణ్‌, మరో స్నేహితుడితో కలిసి బర్త్‌ డే కేక్‌ కట్‌ చేయడం చూడవచ్చు. 

ఆచార్య సినిమాకు సంబంధించి తన షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న రామ్‌ చరణ్‌, రెండు రోజుల క్రితం భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్నేహితుడు శర్వానంద్‌ కోసం సర్‌ప్రైజ్‌ బర్త్‌ డే పార్టీ అరెంజ్‌ చేశారు. రామ్‌ చరణ్‌, శర్వానంద్‌తో పాటు మరో స్నేహితుడు విక్కి కూడా ఈ బర్త్‌ డే పార్టీకి హాజరయ్యాడు.

శ్రీకారం మూవీని పూర్తి చేసిన శర్వానంద్‌ ప్రస్తుతం తరువాత సముద్రం సినిమాతో బిజీగా ఉన్నాడు.అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దార్థ్‌, అను ఇమ్యానుయేల్‌, అదితి రావ్‌ హైదరీ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ క్రమంలో చిత్రం బృందం శర్వానంద్‌ బర్త్‌ డే సందర్భంగా మహా సముద్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. పోస్టర్‌ని బట్టి ఈ సినిమా సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో శర్వానంద్‌ చేతిలో ఆయుధంతో.. చాలా కోపంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇక కిశోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకారం సినిమా ట్రైలర్‌ నిన్న విడుదలైంది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని తెలియజేస్తూ సాగే ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ నటించారు. గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు