వైరల్‌: పంత్‌ నువ్విలా చేయకుండా ఉండాల్సింది!

6 Mar, 2021 11:28 IST|Sakshi
రివర్స్‌ ల్యాప్‌‌ షాట్‌ ఆడుతున్న పంత్‌(ఫొటో కర్టెసీ: ట్విటర్‌)

వహ్వా...ఏమా షాట్‌!

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి తన విలువేమిటో మరోసారి నిరూపించుకున్నాడు టీమిండియా ఆటగాడు రిషభ్‌ పంత్‌. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగి సత్తా చాటాడు. 116 బంతుల్లో టెస్టు కెరీర్‌లో మూడో శతకం పూర్తి చేసుకుని దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే, పంత్‌ ఆడిన సూపర్‌ ఇన్నింగ్స్‌(13 ఫోర్లు, 2 సిక్సర్లు)లో ఒక షాట్‌ మాత్రం రెండో రోజు ఆట మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్‌ 83వ ఓవర్‌లో... తళతళ మెరుస్తున్న కొత్త బంతితో అండర్సన్‌ స్థాయి బౌలర్‌ టెస్టుల్లో బౌలింగ్‌ చేస్తుంటే.. ఏ బ్యాట్స్‌మన్‌ కూడా అలా ఆడేందుకు సాహసించడు.

కానీ అప్పటికే అపార ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తున్న పంత్‌ బౌలర్‌ స్థాయిని పట్టించుకోలేదు. అండర్సన్‌ వేసిన ఫుల్‌ బాల్‌ను పంత్‌ స్లిప్‌ మీదుగా ‘రివర్స్‌ ల్యాప్‌’ షాట్‌తో బౌండరీకి తరలించాడు. తేడా వస్తే తను గాయపడే అవకాశం ఉన్నా పంత్‌ వెనక్కి తగ్గలేదు. అసలు ఈ షాట్‌ ఎలా ఆడగలిగాడు అన్నట్లుగా స్వయంగా అండర్సన్‌ మొహం మాడ్చుకుంటూ చేసిన హావభావాలు దాని విలువేమిటో చూపించాయి! అదీ మరి మన పంత్‌ లెవల్‌.

ఇక పంత్‌ ఆడిన ఈ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రివర్స్‌ షాట్‌ 2021కే హైలెట్‌ అని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కితాబు ఇవ్వగా.. ‘‘లేదు. నువ్వు అస్సలు ఇలా చేయకుండా ఉండాల్సింది రిషభ్‌ పంత్‌’’ అంటూ వసీం జాఫర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం పంత్‌ షాట్‌పై స్పందిస్తూ.. దట్స్‌ మై బాయ్‌ అంటూ ప్రశంసించాడు.

చదవండి:సెహ్వాగ్‌, సచిన్‌ సూపర్‌ ఇన్నింగ్స్.. ఘన విజయం

 పంతానికొక్కడు...

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు