Ram Charan: ఈ మ్యాజిక్ అంతా అక్కడే జరిగింది: ఉపాసన ప్రెగ్నెన్సీపై చెర్రీ

24 May, 2023 19:49 IST|Sakshi

టాలీవుడ్‌లో రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఈ జంట ఒకరు. అయితే ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్షణ కోసం మెగా కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వీరికి పెళ్లయిన దాదాపు 12 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం ధరించడంతో మరింత ఆసక్తి నెలకొంది.

(ఇది చదవండి: రామ్ చరణ్ అరుదైన ఘనత.. తొలి భారతీయ నటుడిగా!)

అయితే తాజాగా శ్రీనగర్‌లో జీ20 సమ్మిట్‌లో గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియాలో ఈ గౌరవం దక్కించుకున్న తొలి నటుడిగా చెర్రీ నిలిచారు. అయితే ఈ సమ్మిట్‌లో జపాన్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నారు చెర్రీ. అంతే కాకుండా తమకు పుట్టబోయే బిడ్డకు జపాన్‌తో సంబంధం ఉందని తెలిపారు. ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడూతూ.. ఈ మ్యాజిక్ అంతా జపాన్‌లోనే జరిగిందని వెల్లడించారు. అందుకే జపాన్ తనకు ఇష్టమైన ప్రదేశమని.. తన మనస్సులో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుందని పేర్కొన్నారు.


 

రామ్ చరణ్‌ మాట్లాడుతూ..'కళాఖండాలను సేకరించడం అనేది ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఎందుకంటే నాకు కళాఖండాలపై పెద్దగా ఆసక్తి లేదు. యూరప్ ఎప్పుడూ నాకు ఇష్టమైన ప్రదేశం. ఇప్పుడు జపాన్ ఇష్టమైన దేశంగా మారింది. అక్కడి సంస్కృతి, ప్రజలంటే ఇష్టం. ప్రస్తుతం నా భార్యకు ఏడో నెల ప్రెగ్నెన్సీ. జపాన్‌లోనే ఈ మ్యాజిక్ జరిగింది (నవ్వుతూ).' అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. రామ్ చరణ్, ఉపాసనతో పాటు చిత్రబృందం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్‌లో పర్యటించారు. జపాన్‌లో ఈ చిత్రానికి ఊహించని రీతిలో ఆదరణ లభించింది.

(ఇది చదవండి: అజిత్ కుమార్ గొప్ప మనసు.. తోటి రైడర్‌కు ఖరీదైన గిఫ్ట్!)

మీ అందరికీ కృతజ్ఞుడిని: రామ్ చరణ్

జీ20 సమ్మిట్‌లో మన సినిమాల సంస్కృతి, ఆధ్యాత్మికత  గొప్పతనాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞుడిని.. అత్యద్భుతమైన కంటెంట్ ద్వారా విలువైన జీవిత పాఠాలను అందించగల సామర్థ్యంతో భారతీయ సినిమా ఒక ప్రత్యేకతను కలిగి ఉందంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తలు