ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్‌’ ట్రైలర్‌

28 Jul, 2020 09:56 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న సంచలన చిత్రం ‘మర్డర్’‌ (కుటుంబ కథా చిత్రమ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌) సినిమా ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక ప్రేమ కథ రెండు కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేసిందనేది సినిమాలో చూపిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సారి ఈ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. 

మాటలేం లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తోనే ట్రైలర్‌ను చూపించారు దర్శకుడు. పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలను కనగలం గాని వాళ్ల మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి అనే టైటిల్స్‌తో సాగిన ట్రైలర్‌ ఉత్కంఠ రేపుతోంది.
(చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్‌ఎంసీ పెనాల్టీ)

మిర్యాలగూడకు చెందిన అమృత, ఆమె తండ్రి మారుతిరావుల కథ ఆధారంగా మర్డర్‌ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఆర్జీవీ కొద్ది రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటిస్తున్నారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్‌ చంద్ర రచనా, దర్శకత్వం వహిస్తున్నారు. 
(ఆర్జీవీ ట్వీట్‌: పవన్‌ను ఓదార్చిన బాబు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా