హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఆర్జీవీ

31 Aug, 2021 07:44 IST|Sakshi

RGV Praises Heroine Megha Akash : ‘‘డియర్‌ మేఘ’’ అద్భుతమైన రొమాంటిక్‌ ఫిల్మ్‌. ఇలాంటి రొమాంటిక్‌ లవ్‌స్టోరి ఈ మధ్య కాలంలో రాలేదు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. మేఘా ఆకాష్, అదిత్‌ అరుణ్, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. అర్జున్‌ దాస్యన్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 3న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ..‘‘మేఘా ఆకాష్‌ 40 ఏళ్ల కిందట కనిపించి ఉంటే నాకు విడాకులు అయ్యేవి కావు. ఆమె చాలా క్యూట్‌గా, హోమ్లీగా ఉంది.

నా సినిమాలకు సెట్‌ అవ్వదు. అరుణ్‌ అదిత్‌తో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారితో పని చేయడం ఆర్జీవీగారికి ఎంత కిక్‌ ఇచ్చిందో,  మేఘాతో పని చేయడం నాకూ అంతే కిక్‌ ఇచ్చింది’’ అన్నారు సుశాంత్‌ రెడ్డి. ‘‘ఈ సినిమా అమ్మాయి వైపు నుంచి కథను చెబుతుంది’’ అన్నారు అర్జున్‌ దాస్యన్‌. 

చదవండి : అల్లు అర్జున్ సరికొత్త రికార్డు.. ‘సౌత్ కా సుల్తాన్’గా ఐకాన్ స్టార్
Drugs Case: ఈడీ ముందుకు సినీ ప్రముఖులు

మరిన్ని వార్తలు