Ram Pothineni: తొలి సినిమా తమిళంలో చేయాల్సింది

23 Apr, 2022 09:05 IST|Sakshi

సాక్షి, చెన్నై: తన మొదటి చిత్రాన్ని తమిళంలో చేయాల్సిందని హీరో రామ్‌ అన్నారు. తాను చెన్నైలో పెరిగి చదివిన కుర్రాడినని తెలిపారు. లింగుస్వామి దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్‌ తీసుకుని రూపొందించారని.. డీఎస్‌పీ అద్భుతమైన సంగీతాన్ని అందించారని తెలిపారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తమిళంలో రామ్‌ కథానాయకుడిగా (తెలుగు, తమిళం) చిత్రం ది వారియర్‌.

చదవండి👉 ది వారియర్‌: ఒక్క పాటకు మూడు కోట్లు

పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం నటుడు శింబు బుల్లెట్‌ అనే పల్లవితో సాగే పాటను తెలుగు, తమిళం భాషల్లో పాడటం విశేషం. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని లక్స్‌ థియేటర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు.  

చదవండి👉 శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మేకర్స్‌

మరిన్ని వార్తలు