గ్యాంగ్‌స్టర్‌ రాక్షస రాజా 

15 Dec, 2023 03:30 IST|Sakshi

రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) సూపర్‌ హిట్‌ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కాంబినేషన్‌లో రెండో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రానా పుట్టినరోజు (డిసెంబర్‌ 14) సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ని ‘రాక్షస రాజా’గా ప్రకటించి, రానా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు.

‘‘ఇప్పటివరకూ చూడని క్రైమ్‌ వరల్డ్‌ని ఆవిష్కరిస్తూ ఇంటెన్స్‌ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాల సమ్మేళనంతో ఈ చిత్రం ఉంటుంది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందించనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ అద్భుతమైన అనుభూతికి గురి చేస్తుంది. గ్రిప్పింగ్‌ కథనం, వండర్‌ఫుల్‌ విజువల్స్‌తో ‘రాక్షస రాజా’ తెలుగు పరిశ్రమలో కొత్త బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేయడానికి రెడీ అవుతోంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు