Rana Daggubati 1945: క్లైమాక్స్‌ లేకుండా బిగ్‌స్రీన్‌కు వచ్చిన రానా మూవీ, ప్రేక్షకుల అసహనం..

8 Jan, 2022 13:05 IST|Sakshi

Rana Daggubati 1945 Movie Released Without Climax: స్టార్‌ హీరో రానా ప్రధాన పాత్రలో ​కొత్త దర్శకుడు సత్య శివ 2016లో తెరకెక్కించిన చిత్రం 1945. బ్రిటీష్‌ పాలన నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇందులో హీరోయిన్‌గా రెజీన నటించగా.. నాజర్‌, సత్యరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. బాహుబలి సినిమా సమయంలో రానా ఈ మూవీకి కమిట్మెంట్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో షూటింగ్‌ చివరి దశలో ఉందనగా ఈ మూవీ నిర్మాత సి. కల్యాన్‌, దర్శకుడు సత్య శివ, రానాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో రానా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో 90 శాతం పూర్తయిన షూటింగ్‌ ఆగిపోయింది.

చదవండి: Sukumar: మణిరత్నం గారంటే అభిమానం, కానీ కలిసేందుకు వెళ్లిన నాతో సీరియస్‌గా..

ఇదిలా ఉంటే నాలుగేళ్ల తర్వాత ఈ మూవీని రిలీజ్‌ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు. చెప్పినట్టుగానే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌ ఈ మూవీని జనవరి 7న థియేటర్లో విడుదల చేశారు మేకర్స్‌. అయితే 1945 చూసిన వాళ్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు క్లైమాక్స్‌ లేదని, ఎడింగ్‌ కూడా సరిగా లేదు. సినిమా అంతా అస్తవ్యస్తంగా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌ చేస్తున్నట్లు గతంలో మేకర్స్‌ ప్రుకటించిన వెంటనే రానా స్పందిస్తూ ట్వీట్‌ చేశాడు.

చదవండి: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్‌

‘సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. క్లైమాక్స్‌ సీన్స్‌ షూటింగ్‌ జరగలేదు. అలాగే నిర్మాత నుంచి నాకు రావాల్సిన రెమ్యునరేషన్‌ అందలేదు. డబ్బుల కోసమే పూర్తికాని సినిమాను విడుదల చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు’ అంటూ రాసుకొచ్చాడు. ఇక రానా ట్వీట్‌ నిర్మాతలు రిప్లై ఇస్తూ.. ‘సినిమా పూర్తి అయ్యిందా లేదా అనేది దర్శకులది తుది నిర్ణయం’ అంటూ అనడంతో రానా ఒకే అన్నట్లుగా థంమ్స్‌ప్‌ ఎమోజీనితో స్పందించాడు. కాగా ఈ సినిమా సుభాశ్‌ చంద్రబోస్‌ జీవిత కథ, ఆయన మరణం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ మూవీ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లో లీకైంది. మూవీరూల్స్‌, తమిళరాక్స్‌ వంటి వెబ్‌సైట్లలోకి అందుబాటులో ఉంది. 

మరిన్ని వార్తలు