Ranveer, Alia Bhatt: రాఖీ.. రాణీ ప్రేమకథ!

7 Jul, 2021 00:30 IST|Sakshi
రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌

‘గల్లీబాయ్‌’ వంటి సూపర్‌హిట్‌ మూవీ తర్వాత రణ్‌వీర్‌ సింగ్, ఆలియా భట్‌ ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహాని’ సినిమాలో జంటగా నటించనున్నారు. దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ (2016) తర్వాత కరణ్‌ మళ్లీ దర్శకత్వం వహించనున్న చిత్రం ఇదే.

‘‘నాకు ఎంతో ఇష్టమైన దర్శకత్వ బాధ్యతలను మరోసారి స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు కరణ్‌. ఇక ఈ చిత్రంలో సీనియర్‌ తారలు ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ ముఖ్య పాత్రలు పోషించనున్నారు.  రణ్‌వీర్‌ గ్రాండ్‌ మదర్‌గా జయా బచ్చన్, ఆలియా భట్‌ గ్రాండ్‌ పేరెంట్స్‌గా ధర్మేంద్ర, షబానా కనిపిస్తారని టాక్‌.

మరిన్ని వార్తలు