Dhamaka OTT Release : 'ధమాకా' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..

11 Jan, 2023 12:42 IST|Sakshi

మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ధమాకా' సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ. 100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. రవితేజ ఎనర్జీ, శ్రీలల డ్యాన్స్‌ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.. రవితేజ మాస్‌ స్టామినా, స్టార్‌ పవర్‌తో ధమాకా పైసా వసూల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.

ఈ సినిమా రిలీజ్‌ అయిన మొదటిరోజు నుంచే హిట్‌టాక్‌ను తెచ్చుకుంది. ఇక త్వరలోనే ధమాకా చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ డిటిటల్‌ రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. నెట్టింట అందుతున్న సమాచారం ప్రకారం.. ఈనెల 22న ధమాకా స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. ఇది తెలిసి రవితేజ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు