చెర్రీ భారీ యాక్షన్‌.. ఒక్క ఫైట్‌ కోసం రూ.8 కోట్లు. పక్కా స్కెచ్చేసిన శంకర్‌

22 Sep, 2021 09:01 IST|Sakshi

దర్శకుడు శంకర్‌ సినిమాల్లో ట్రైన్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. ఆయన గత చిత్రాలు ‘రోబో’, ‘ఐ’లో ఉన్న ట్రైన్‌ యాక్షన్‌ సన్నివేశాలే ఇందుకు ఓ నిదర్శనం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
(చదవండి: RC 15: ఒక్క కాన్సెప్ట్‌ పోస్టర్‌కే అంత ఖర్చు పెట్టించాడా!)

ఇందులో ట్రైన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేస్తున్నారట శంకర్‌. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఓ భారీ సెట్‌ను తయారు చేయిస్తున్నారని సమాచారం. ఈ ఫైట్‌ సీన్స్‌కి దాదాపు ఎనిమిది కోట్లు కేటాయించారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సీన్స్‌లో వందలమంది ఫైటర్స్‌ పాల్గొంటారట. మరి... ఈ వార్త నిజమైతే రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు ఫైట్‌ ఫీస్ట్‌ ఖాయమనే చెప్పొచ్చు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు