డిజిటల్‌ ఎంట్రీకి రెడీ

23 Sep, 2020 04:13 IST|Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌ వెబ్‌ ఎంట్రీకి రెడీ అయ్యారనే వార్తలు బాలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి. హాలీవుడ్‌ నటుడు టామ్‌ హిడిల్‌స్టన్‌ నటించిన టీవీ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ హిందీ వెర్షన్‌లో నటించనున్నారట రణ్‌బీర్‌. ఇంగ్లిష్‌లో విజయం సాధించిన ఈ కథ ఆధారంగా హిందీలో 10 ఎపిసోడ్స్‌ నిర్మించనున్నారని సమాచారం. కొన్ని వారాల క్రితమే ఈ  సిరీస్‌లో నటించడానికి రణ్‌బీర్‌ అధికారికంగా సైన్‌ చేశారని టాక్‌. అయితే దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలి? అనే ఆలోచనలో ఉందట ఈ వెబ్‌ సిరీస్‌ని నిర్మించనున్న డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థ. భారీబడ్జెట్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ కథను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని లొకేషన్లలో చిత్రీకరించడానికి ప్లాన్‌ చేస్తున్నారని భోగట్టా. ప్రస్తుతం రణ్‌బీర్‌ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రహ్మాస్త్ర’, ‘షంషేరా’లతో పాటు మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌కు డేట్లను సర్దుబాటు చేసే పనిలో పడ్డారట రణ్‌బీర్‌ కపూర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా