సైంటిస్టుగా రెజీనా.. త్వరలోనే ట్రైలర్‌

19 Aug, 2021 11:20 IST|Sakshi

రెజీనా హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘నేనే నా’. కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించారు. సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా కార్తీక్‌ రాజు మాట్లాడుతూ– ‘‘నేనే నా’ మిస్టరీ కథాంశంతో తెరకెక్కింది.ఎంటర్‌టైన్‌మెంట్, సూపర్‌ విజువల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది.

ఇందులో రెజీనా పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో కనిపిస్తారు. రెజీనా ఏం పరిశోధిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. మా సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్, కెమెరా: గోకుల్‌ బెనోయ్‌. 

చదవండి : సినిమాలో ఆ షాట్‌ చాలా ప్రత్యేకం: హన్సిక
క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అవుదామని ఇండస్ట్రీకొచ్చాను.. అయితే

మరిన్ని వార్తలు