నార్తాన్‌ డైరెక్షన్‌లో రాక్‌స్టార్‌ యశ్‌.. భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

17 Jun, 2021 18:35 IST|Sakshi

‘కేజీఎఫ్‌’ మూవీతో కన్నడ రాక్‌ స్టార్‌ యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ సంచలన విసజయం సాధించి రికార్డు సృష్టించింది. దీంతో డైరెక్టర్‌ యశ్‌తో దీనికి సిక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ను తెరకెక్కించాడు. త్వరలో మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో యశ్‌ నెక్ట్‌ చిత్రం కోసం అభిమానులంతా అసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాక్‌స్టార్‌ తదుపరి మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముఫ్తీ ఫేం నార్తాన్‌తో ఓ సినిమాకు యశ్‌ సంతకం చేసినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో యశ్‌ నెవీ ఆఫిసర్‌గా కనిపించనున్నాడట.

భారీ బడ్జేట్‌తో రూపొందే ఈ మూవీని జీ స్టూడియోస్‌, హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మింస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులో యశ్‌ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇంతవరకు టైటిల్‌ ఖారారు కానీ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి డైరెక్టర్‌ సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సినీ గేయ రచయిత, స్క్రీన్ రైటర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నార్తాన్‌.. ప్రశాంత్ నీల్‌ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ ‘ఉగ్రమ్’, ‘రథవారా’ చిత్రాలకు పనిచేశాడు. ఆ తర్వాత 2017లో ‘ముఫ్తీ’ మూవీతో డైరెక్టర్‌గా మారారు. తన తొలి చిత్రంతోనే సూపర్‌ సెక్సెన్‌ను అందుకున్నాడు నార్తన్‌.

చదవండి: 
KGF Chapter 2 : అరుదైన రికార్డు సాధించిన ‘రాఖీ భాయ్‌’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు