‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాకిచ్చిన నటి.. విడుదల తేదీ లీక్‌

23 Jan, 2021 12:25 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, అలిసన్ డూడీ, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' వీడియోలు రికార్డులు క్రియేట్‌ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే చిత్ర యూనిట్‌ మాత్రం విడుదల తేదీని గోప్యంగా ఉంచుతూ ప్రేక్షకులకు మరింత క్యూరియాసిటీ పెంచాలనుకుంది. కానీ వారి ప్లాన్‌కు బ్రేకులు వేసింది ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల తేదీని తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. తాజాగా ఆమె తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ స్టోరీలో ఆర్‌ఆర్‌ఆర్‌ అనే అకౌంట్‌ను జత చేస్తూ రిలీజ్ డేట్ అక్టోబర్ 8 అని అందులో రాసుకొచ్చింది. చేసిన పొరపాటును వెంటనే గ్రహించిన అలీసన్ డూడీ.. ఆ పోస్టును డిలీట్ చేసేసింది. అయితే, అప్పటికే కొంతమంది ఆ స్క్రిన్ షాట్స్ తీసి ఇంటర్నెట్‌లో వైరల్‌ చేశారు. ఏదేమయిన ఐరిష్ భామ చేసిన పని అభిమానులకు సంతోషం కలిగించగా.. చిత్ర యూనిక్‌కు మాత్రం షాక్‌లోనే ఉంది. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు