POP Star Dima Nova Passed Away: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శిస్తూ పాట పాడిన ప్రముఖ సింగర్‌ కన్నుమూత

23 Mar, 2023 09:03 IST|Sakshi

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. రష్యా పాప్‌ సింగర్‌ సింగర్ దిమా నోవా(34) ప్రమాదంలో మృతి చెందారు. తన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించిన దిమా నోవా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ద సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు చేస్తూ పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తన గాత్రంతో ఎంతో ఆదరణ పొందిన దిమా నోవా ఆకస్మిక మరణంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొనుగోలు..

ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. దిమా నోవా అసలు పేరు దిమిత్రి విర్గినోవ్‌. చిన్ననాటి నుంచే తన గానంతో అలరిస్తున్న దిమా నోవా ‘క్రీమ్ సోడా’ అనే మ్యూజిక్ సంస్థను నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 19న తన సోదరుడు, స్నేహితులతో ఫ్రోజన్‌ వోల్గా నది దాడుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దిమా నోవా, అతడి స్నేహితులు, సోదరుడు మంచు కురుకుపోయారు.

చదవండి: అమ్మ ప్రెగ్నెంట్‌ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి

ఈ క్రమంలో ఊపరి ఆడక ఆయన చనిపోయినట్లు రష్యన్‌ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంగా గాయపడిన తన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మిగిలిన వారు ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కాగా దిమా నోవా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ  తన సంగీతం, పాటలతో పుతిన్‌ను విమర్శించేవాడు. ఈ క్రమంలోనే అక్వా డిస్కో అనే పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అప్పట్లో ఈ పాట పెద్ద వివాదం కూడా అయ్యింది. రష్యాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవారు ఈ పాట పాడుతూ నిరసనలు తెలిపేవారు. 

మరిన్ని వార్తలు