పిల్లలకు మెహందీ పెడుతున్న హీరోయిన్‌

23 Oct, 2020 18:31 IST|Sakshi

హైదరాబాద్‌: దక్షిణాది తారల్లో సాయిపల్లవికి ప్రత్యేక స్థానం ఉంది. అద్భుతమైన డ్యాన్స్‌ స్టెప్పులతో యూత్‌ను ఫిదా చేసిన ఈ రౌడీబేబీ, అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఎంతో దగ్గరైంది. కమర్షియల్‌ యాడ్స్‌లో నటించి లక్షలాది రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా, వాటికి నో చెప్పి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇక సామాజిక అంశాలపై స్పందించే సాయిపల్లవి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటోలు నెటిజన్లనే కాదు సెలబ్రిటీలను కూడా విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.(చదవండి: కంగ్రాట్స్‌ డాడీ: మంచు లక్ష్మి )

ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిప్రీలో ఉన్న ఈ అమ్మడు, సమీప గ్రామంలోని చిన్నారులతో సరదాగా సమయం గడిపింది. వాళ్ల అరచేతులను మెహందీ డిజైన్లతో నింపి, పిల్లల ముఖాల్లో చిరునవ్వులు పూయించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను షేర్‌ చేసిన సాయిపల్లవి.. ‘‘హ్యాపీ క్లైంట్స్‌.. పిప్రీ పిల్లాస్‌’’అనే క్యాప్షన్‌తో పాటు హార్ట్‌ ఎమోజీలను జతచేసింది. ఇందుకు స్పందించిన స్టార్‌ హీరోయిన్‌ సమంత.. సో క్యూట్‌ అంటూ కామెంట్‌ చేయగా, మరో హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ సైతం సాయిపల్లవి పోస్టులకు లైక్‌ కొట్టింది. కాగా సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో రానాతో విరాటపర్వం, నాగచైతన్యతో లవ్‌స్టోరీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండిప్యాలెస్‌ కోసం రూ. 800 కోట్లు చెల్లించిన నటుడు!)

Happy Clients♥️Pipri Pillas♥️

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు