వ్యవసాయం చేస్తున్న తైమూర్‌, సైఫ్‌

7 Nov, 2020 18:59 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌, ఆయన తనయుడు తైమూర్‌ అలీ ఖాన్‌లు వ్యవసాయ భూమిలో సందడి చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. గత అక్టోబర్‌ సెలవు రోజుల్లో సైఫ్‌ దంపతులు తమ కుమారుడు తైమూర్‌తో కలిసి తమ పటౌడి ప్యాలెస్‌లో గడిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైఫ్‌, తైమూర్‌లు పటౌడిలోని తమ ఫాంలో వ్యవసాయం చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను ఫిలీమీడాట్‌కాం ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో తైమూర్‌ నీరు ప్రవహిస్తున్న చిన్న నీటి కాలువలో ఆడుకుంటండగా.. సైఫ్‌ పక్కనే బురద చేతులను నీటితో కడుక్కంటున్నాడు. (చదవండి: ప్యాలెస్‌ కోసం రూ. 800 కోట్లు చెల్లించిన నటుడు!)

Like father like son ❤ Tim and daddy Saif Ali Khan turn to farming in Pataudi! . . #saifalikhan #saifalikhanpataudi #taimuralikhanpataudi #taimuralikhan #taimurali #taimuralikhan❤ #likefatherlikeson❤️ #likefatherlikeson #bollywoodactor #kareenakapoor #kareenakapoor #bollywoodnews #entertainmentindustry #instadaily #filmydotcom

A post shared by FilmyDotcom (@filmydotcom) on

ఈ తండ్రి కుమారులు ఇద్దరూ ఫాంలో వ్యవసాయం చేస్తున్న ఈ ఫొటోలకు నెటిజన్‌లు ఫిదా అవుతున్నారు. ఇక బరద నీటిని ఎంజాయ్‌ చేస్తున్న బుడ్డి పటౌడిని చూసి ‘తైమూర్‌ ఎ‍ంత ముద్దుగా ఉన్నాడో’ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. అయితే కరీనా కపూర్‌ తన తాజా చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్‌ పూర్తి చేసుకుని ముంబైలో తన కుటుంబంతో కలిసి విశ్రాంతి తీసుకుంటుండగా.. సైఫ్‌ తన రాబోయే చిత్రం ‘భూట్ పోలీసులు’ షూటింగ్‌లో భాగంగా డల్హౌసిలో ఉన్నాడు. 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు మూడేళ్ల తైమూర్‌ జన్మించాడు. ప్రస్తుతం కరీనా ఆరునెల గర్భవతిగా ఉన్నారు.  ఈ విషయాన్ని స్వయంగా కరీనా-సైఫ్‌లు గత ఆగష్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: ‘సైఫ్‌ను ప్రేమిస్తున్నాను.. కరీనాకు తెలుసు’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా