సల్మాన్‌ ఖాన్‌ మూవీ భారీ సెట్‌ కూల్చివేత!

4 Jun, 2021 11:40 IST|Sakshi

కరోనా కష్టాలు సిసీ పరిశ్రమను ఇప్పట్లో వదిలేలా లేవు. సినిమా భాషలో చెప్పాలంటే కరుడుగట్టిన విలన్‌లా మారింది. గత రెండేళ్ల నుంచి దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. రెండేళ్లుగా ఎన్నో సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. కరోనా సెకండ్‌ వేవ్‌, అకాల వర్షాల కారణంగా షూటింగ్‌ కోసం వేసిన ఎన్నో సెట్స్‌ దెబ్బతిన్నాయి. కొన్ని సెట్స్‌ కూలిపోయాయి కూడా. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ సినిమా కోసం వేసిన ఓ భారీ సెట్‌ని కూల్చివేయాలని భావిస్తున్నారట చిత్ర నిర్మాత. 

సల్మాన్‌ఖాన్, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన  చిత్రం ‘టైగర్‌ 3’. ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో సెట్స్‌పైకి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కత్రినాకు కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో చిత్రీకరణ ఆగింది. ఈ సినిమా కోసం గుర్గావ్‌లో ప్రత్యేకంగా సెట్‌ను తీర్చిదిద్దారు. ఆ సెట్‌ మొన్నటి  తౌటే తుపాను దెబ్బకు పాక్షికంగా దెబ్బతింది. ఇప్పుడేమో వర్షాలు మొదలయ్యాయి. షూటింగ్‌కి అనుమతి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అందుకే ఈ సెట్‌ను కూల్చేస్తున్నారట. అనుమతులు వచ్చి చిత్రీకరణలు మొదలయ్యాక తిరిగి కొత్తగా సెట్‌ను నిర్మించుకోవచ్చనే ఆలోచనలో నిర్మాత ఆదిత్య చోప్రా ఉన్నారని తెలుస్తోంది.
చదవండి:
బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌పై కేసు: హీరో తల్లి ఏమందంటే?
ఆగిన MI-7 షూటింగ్​..టామ్​ క్రూజ్​కి కరోనా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు