Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర.. ఇంటి వద్ద రెక్కీ

13 Sep, 2022 12:47 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ హత్యకు ముంబైలో రెక్కీ నిర్వహించారు. పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడ్డ నిందితులే సల్మాన్‌ హత్యకు కూడా ప్లాన్‌ చేసినట్లు పంజాబ్‌ డీజీపీ గైరవ్‌ యాదవ్‌ వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సూచనల మేరకు ఈ రెక్కీ నిర్వహించినట్లు డీజీపీ తెలిపారు.మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన కపిల్ పండిట్‌ను విచారించగా ఈ రెక్కీ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో చాలామంది ఉన్నారని అలాంటి వారిలో సల్మాన్ కీలక టార్గెట్ అని పండిట్ తెలిపాడు. ముంబైలో సల్మాన్‌ఇంటి వద్ద సుమారు మూడురోజుల పాటు ఈ రెక్కీ నిర్వహించినట్లు నిందితుడు అంగీకరించినట్లు డీజీపీ తెలిపారు.

కాగా సిద్ధూ మూసేవాలాను హత్యకేసులో 35మంది నిందితుల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 23 మందిని అరెస్ట్‌ చేశారు. గతంలో కూడా సల్మాన్‌ని చంపుతామని బెదిరింపులు వచ్చాయి. తాజాగా  అతన్ని హతమార్చేందుకు రెక్కీ నిర్వహించిన నేపథ్యంలో సల్మాన్‌కి సెక్యూరిటీ పెంచారు. 
 

మరిన్ని వార్తలు