ఓడిపోతానని కష్టపడేదాన్ని

3 Sep, 2020 01:11 IST|Sakshi

నటిగా సమంత భయాలేంటి? ఏ జానర్‌ సినిమాలు ఇష్టపడతారు? ఆమె పాటించే జీవిత సూత్రాలేంటి? అని ఫ్యాన్స్‌కు తెలుసుకోవాలని ఉంటుంది. బుధవారం సాయంత్రం ట్విట్టర్‌లో ‘ఏ ప్రశ్న అయినా అడగండి.. సమాధానం చెబుతాను’ అని ఫ్యాన్స్‌తో అన్నారు సమంత. అంతే.. ఫ్యాన్స్‌కి ఉన్న ప్రశ్నలన్నీ సమంత మీద కురిపించారు. అందులో కొన్నింటికి ఆమె సమాధానం చెప్పారు. అందులో కొన్నింటిని మీ కోసం తీసుకొచ్చాం.


► చాలా జానర్లలో సినిమాలు చేశారు. మీ ఫేవరెట్‌ జానర్‌ ఏది?
సమంత: ఫేవరెట్‌ అంటూ ఏదీ లేదు. కానీ గత సినిమాలో ఏది చేశానో దాన్ని రిపీట్‌ చేయాలనుకోను. అదే చేస్తే ఆడియన్స్‌కు, నాకు బోర్‌ కొడుతుంది.


► ఈ కరోనా కష్టకాలంలో మీ అభిమానులకు ఏం సందేశమిస్తారు?
ప్రస్తుతం అందరం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. కొందరైతే చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టకాలం  త్వరగా గడచిపోవాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

► లాక్‌డౌన్‌లో మీరు చేసిన మంచి పని ఏంటి?
ఈ లాక్‌డౌన్‌లో ఓ స్పెషల్‌ ప్రాజెక్ట్‌ మీద పని చేశా. అదేంటో మీ అందరికీ త్వరలోనే చెబుతాను. అలాగే కుటుంబంతో ఎక్కువగా గడిపే అవకాశం దొరికింది. అదొక మంచి విషయం.

► కష్టపడి పని చేయడానికి మిమ్మల్ని మీరు ఎలా ప్రేరేపించుకుంటారు?
ఇంతకు ముందు ఓడిపోతాం అనే భయంతో కష్టపడేదాన్ని. కానీ కరోనా వల్ల నా ఆలోచనా ధోరణి మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే నాకు సంతోషాన్ని ఇస్తాయి అనే విషయాలకు మాత్రమే కష్టపడాలనుకుని నిర్ణయించుకున్నాను. సంతోషంగా ఉండాలనే ఆలోచన నన్ను మోటివేట్‌ చేసేస్తుంది. కష్టపడేలా చేస్తుంది.

► జీవితం మెరుగు పడాలంటే ఏం చేయాలి?
కచ్చితమైన డైట్‌ పాటించాలి. యోగా లేదా ధ్యానం లాంటివి చేయాలి. ప్రణాళికతో కూడిన దినచర్యను అలవాటు చేసుకోవాలి.

► ఎలాంటి పాత్రలు చేయడం కష్టంగా అనిపిస్తుంది?
దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ను కలిసే వరకూ రొమాన్స్‌ కష్టం అనుకున్నాను. నందినీ రెడ్డిని కలిసే వరకూ కామెడీ కష్టమనుకున్నా. కానీ ఇప్పుడు ఎలాంటి పాత్ర అయినా భయపడను. నటిగా నాకెలాంటి భయాల్లేవు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు