తెలుగు పొలిటికల్‌ స్టార్‌ బయోపిక్‌లో సముద్రఖని

11 Dec, 2023 13:46 IST|Sakshi

సముద్రఖని సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా దర్శకుడిగా ఏది చేసిన తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఫుల్ బిజీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. దర్శకుడిగా చేసినా, నటుడిగా చేసినా సముద్రఖని చేశాడు అంటే అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుంది.

తన మనసుకి నచ్చితేనే పాత్ర చేస్తాననే సముద్రఖని గురించి సోషల్ మీడియాలో ఓ వార్తా హల్చల్ చేస్తుంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుని బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే దానికి సంబంధించిన పనులు కూడా మొదలైనట్టు తెలుస్తుంది. తెలంగాణకు చెందిన గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో సముద్రఖని నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయన 1983-1994, 1999-2009 మధ్య యెల్లందు శాసనసభ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. నర్సయ్య నమోదుకాని రాజకీయ పార్టీ CPI (ML)కి చెందినవారు. యెల్లందు నుంచి ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ​​​​​​కానీ ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు.

అవినీతి మచ్చలేని వ్యక్తిగా, పేద ప్రజల ఆశ జ్యోతిగా, ఉండడానికి స్వంత ఇళ్ళు కూడా సరిగ్గా నిర్మించుకోలేని ఓ గొప్ప మానవాతివాది కావడంతో అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ జనరేషన్‌కు తెలియాలనే ఉద్దేశంతో ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్నట్టు సినీ సన్నిహితుల నుంచి సమాచారం. ఇదే కనుక నిజమైతే సముద్రఖని మరో నట విశ్వరూపం మనం చూడబోతున్నాం. ఏం జరుగుతుందో మున్ముందు చూడాలి. ఈ చిత్రంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు