Kalyanam Kamaneeyam: ప్రభాస్ అన్న ప్రేమ దక్కడం నా అదృష్టం: సంతోష్‌ శోభన్‌

10 Jan, 2023 17:25 IST|Sakshi

ప్రభాస్ అన్న నాకు ఇచ్చే సపోర్ట్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్. నా గత చిత్రాల ప్రమోషన్ కు సపోర్ట్ చేశారు. కళ్యాణం కమనీయం సినిమా పాట రిలీజ్ చేస్తున్నారు. నేను ఆయన అభిమానిని. మా మధ్య ఉన్నది అభిమాని, స్టార్ మధ్య ఉన్న బంధం. ప్రభాస్ అన్న ప్రేమ దక్కినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి’ అని యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ అన్నారు.  ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం’. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా సంతోష్‌ శోభన్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

ఏక్ మినీ కథ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు "కళ్యాణం కమనీయం" కథ విన్నాను. నా మిత్రుడు, ఈ సినిమా కో ప్రొడ్యూసర్ అజయ్ దర్శకుడు అనిల్ కుమార్ ను పరిచయం చేశారు. ఆయన చెప్పిన కథ బాగా నచ్చింది. మనం రెండు రకాల సినిమాలు చూస్తుంటాం. ఒకటి ఆస్పిరేషనల్, రెండోది రిలేటబుల్. ఇది మనందరికీ రిలేట్ అయ్యే కథ. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. కథ చెప్పగానే సంతోషంగా ఒప్పుకున్నాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.

సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసుకోవాలనేది నా కల. అది ఈ చిత్రంతో తీరుతోంది. బిగ్ స్టార్స్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇది చిత్ర పరిశ్రమకు పెద్ద సంక్రాంతి. ఈ పండక్కి విడుదలవుతున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు చిత్రాలతో పాటు  ‘కళ్యాణం కమనీయం’ కూడా ఆదరించండి

నేను ఇప్పటిదాకా చేసిన సోషల్ కామెడీ మూవీస్ లో నా పాత్రలు రియాల్టీకి కొంత దూరంగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో నేను చేసిన శివ క్యారెక్టర్ చాలా జెన్యూన్ గా ఉంటుంది. ఇందులో ఫేక్ నెస్ లేదు. ఆ సిట్యువేషన్ కు తగినట్లు శివ క్యారెక్టర్ నిజాయితీగా రెస్పాండ్ అవుతుంది.

 ఇందులో శృతి జాబ్ చేస్తుంది శివకు ఉద్యోగం ఉండదు. అయితే ఇదొక్కటే కథలో కీలకం కాదు. ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితంలో ఎదురైన పరిస్థితులను తట్టుకుని ఎలా ముందుకు సాగారు అనేది చూపిస్తున్నాం. రెగ్యులర్ ఫార్మేట్ సినిమా కొలతలు "కళ్యాణం కమనీయం" లో ఉండవు. ఈ సినిమా ఒక ఎక్సీపియరెన్స్ లా ఉంటుంది.

► లైఫ్ అంటే ఒకరి మీద మరొకరం ఆధారపడటం. నాన్న మాకు దూరమైనప్పుడు అమ్మ మమ్మల్ని ఏ కష్టం తెలియకుండా పెంచింది. అప్పుడు అమ్మ మీద ఆధారపడ్డాను. లైఫ్ లో ఒక సందర్భం వస్తే భార్య సంపాదన మీద భర్త కొంతకాలం లైఫ్ లీడ్ చేస్తాడు. అది వాళ్లిద్దరికి మధ్య సమస్య. భార్యా భర్తలకు ఇష్టమైతే వాళ్ల జీవితాన్ని ఎలాగైనా గడుపుతారు. నేను నిజ జీవితంలో జాబ్ లేకుంటే బాధపడాలి. నేను ఆ క్యారెక్టర్ లో నటిస్తున్నా కాబట్టి పర్సనల్ గా తీసుకోలేదు.

► ఈ చిత్రంలో పాటలు కథను ఎక్కడా బ్రేక్ చేయవు. కథ కూడా పాటలతో ముందుకు వెళ్తుంది. శ్రావణ్ భరద్వాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. అలాగే కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఆకర్షణ అవుతుంది.

► యూవీ క్రియేషన్స్ సంస్థ నా ఫ్యామిలీ ప్రొడక్షన్ లాంటిది. ఇక్కడ మూడు చిత్రాలు చేశాను. మరో ముప్పై చేసేందుకైనా సిద్ధం. నా లైఫ్ లో పేరున్న దర్శకులు మారుతి, మేర్లపాక గాంధీ లాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ల దగ్గర ఎంత నేర్చుకున్నానో ఈ చిత్ర దర్శకుడు అనిల్ దగ్గర అంతే నేర్చుకున్నాను

 ► కథల ఎంపికలో నిర్ణయం నాదే. నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్స్ క్రెడిట్ తీసుకుంటా. అప్పుడే మనశ్సాంతిగా ఉంటుంది. ప్రస్తుతం నందినీ రెడ్డి గారి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ లో అన్ని మంచి శకునములే అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది కాకుండా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా చేస్తున్నాను.

మరిన్ని వార్తలు