కింగ్‌ ఖాన్‌ పుట్టినరోజు.. ‘మనం కలిస్తే మ్యాజిక్కే’

2 Nov, 2020 13:07 IST|Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా‌ షారుక్‌ ఖాన్‌ నేడు 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సోమవారం ఆయన 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమనుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం షారుక్‌ యూఏఈలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తన జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మద్దతు ఇస్తున్నారు. ఇక షారుక్‌ తన 30 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 90 చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలోని అందరి హీరోయిన్లతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో షారుక్‌తో కలిసి జీరో, జబ్‌ తక్‌ హై జనాన్‌ వంటి సినిమాలో నటించిన అనుష్క శర్మ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. చదవండి: ‘షారుక్‌లా అవ్వాలంటే ఏం తినాలి?’

అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షారుక్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ.. లెజండరీ, ఒపెన్‌ హార్టెడ్‌నెస్‌, ఇంటెలిజెన్స్‌.. అల్‌ ఇన్‌ వన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్టు చేశారు. అలాగే షారుక్‌తో కలిసి అనేక పాటలకు కొరియోగ్రఫ్‌ చేసిన ఫరా ఖాన్‌.. గతంలో షారుక్‌తో దిగిన ఫోటోను షేర్‌చేస్తూ ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. అదే విధంగా షారుక్‌ నటించిన ‘బాజీగర్‌’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టి శిల్పా శెట్టి తన మొదటి హీరోకు ట్వీట్‌ చేశారు. ‘నా మొదట హీరో, నా బాజిగర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జీవితంలో అన్ని ఆనందాలను పొందాలని ఆశిస్తున్నాను’. అని పేర్కొన్నారు. చదవండి: షారుఖ్‌ ‘మన్నత్’‌ను అమ్మేస్తున్నాడా?!

Happy birthday @iamsrk .. the most valuable Antiques are old friends 😘😜 ♥️

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on

దిల్‌తో పాగల్‌ హై, కోయలా, అంజమ్‌, దేవదాస్‌ వంటి చిత్రాల్లో షారుక్‌తో నటించిన మాధురి దీక్షిత్‌ తన సహ నటుడికి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. వీరిద్దరు కలిసి దిగిన ఫోటోను పోస్టు చేస్తూ.. ‘మనం కలిసినప్పుడల్లా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏదో మ్యాజిక్‌ జరుగుతుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఉండండి. త్వరలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ఇదిలా ఉండగా కింగ్‌ ఖాన్‌ పాత స్నేహితుల్లో ఒకరైన జూహి చావ్లా ఎస్‌ఆర్‌కే పుట్టిన రోజు సందర్భంగా 500 మొక్కలను నాటినట్లు ట్విటర్‌లో వెల్లడించారు.

కాగా  ప్రతి ఏడాది నవంబర్ 2న షారుక్‌‌ పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఇంటి వద్ద వేలాది మంది అభిమానులు గుమ్మి గూడుతారు.  ‘మన్నత్‌’గా పేరొందిన విలాసవంతమైన ఆ బంగ్లా ఖరీదు దాదాపు రూ. 200 కోట్లు. అయితే కోవిడ్‌ కారణంగా ఈ ఏడాది ఎవరూ గుంపులుగా రావొద్దని షారుక్‌ వేడుకున్నారు. అయితే ఈసారి తన పుట్టిన రోజున మన్నత్‌ను తన అభిమానులకు వర్చువల్ రియాల్టీ ద్వారా చూపించేందుకు సిద్దం అవుతున్నట్లు ప్రకటించాడు. వీఆర్ సెట్‌ను ఉపయోగించి మన్నత్ ను అనువనువు 360 డిగ్రీలు తిరిగి చూసే వీలును షారుఖ్ కల్పించబోతున్నాడు. ఇది నిజంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు