షారుఖ్‌ న్యూ లుక్‌ హల్‌చల్‌

1 Dec, 2020 13:58 IST|Sakshi

సాక్షి, ముంబై: ‘‘జీరో’’ సినిమా డిజాస్టర్‌ తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా చాలాకాలం పాటు వెండితెరకు దూరమయ్యాడు. ఈ సినిమా అభిమానులను ఎంతగానో నిరాశపరటడంతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌  నిర్మాణ సారథ్యంలో సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కే పఠాన్‌ మూవీతో ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసి మీద ఉన్నాడు. ఈ సిని​మాను ఇప్పటికే సెట్స్‌ మీదకు తీసు​​​కువెళ్లినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో షారుక్‌ సరికొత్త లుక్‌తో కనిపిస్త్ను ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముంబైలోని యష్ రాజ్ స్టూడియో ప్రాంగణంలో షారుఖ్ ఖాన్ సరికొత్తగా కనిపించాడు. పొడవాటి జుట్టు, హెయిర్‌ బ్యాండ్‌, గడ్డంతో ఉన్న కింగ్‌ఖాన్‌ న్యూలుక్‌ అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో పఠాన్ చిత్రం పట్టాలెక్కిందని, త్వరలోనే షారుక్‌ను వెండితెర మీద చూసే అవకాశం వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు