Shehnaaz Gill: సల్మాన్‌ మీద అలా పడిపోతున్నావేంటి? అంటూ నటిపై ట్రోలింగ్‌

5 May, 2022 19:41 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పిత ఖాన్‌, ఆమె భర్త ఆయుష్‌ శర్మ మంగళవారం నిర్వహించిన ఈద్‌ పార్టీలో బాలీవుడ్‌ ప్రముఖులు తళుక్కుమని మెరిశారు. ఈ ఈద్‌ పార్టీకి బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి, సింగర్‌ షెహనాజ్‌​ గిల్‌ కూడా హాజరైంది.

ఈ సందర్భంగా సల్మాన్‌ను హగ్‌ చేసుకుంటూ అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారగా పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'అంత పెద్ద హీరోకు అలా ముద్దు పెట్టేస్తుందేంటి?', 'దొరికిందే ఛాన్స్‌ అని మీదమీద పడుతోంది, తాగిన వ్యక్తిలా ప్రవర్తిస్తోంది', 'సిద్దార్థ్‌ శుక్లా లేకుండానే ఈద్‌ జరుపుకుంటున్నానన్న బాధ ఇసుమంతైనా కనిపించడం లేదు' అంటూ నానామాటలు అంటూ ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు.

దీంతో ఈ బ్యూటీ ఫ్యాన్స్‌ ఊరుకుంటారా? మా షెహనాజ్‌ను ఏమైనా అంటే ఊరుకునేదే లేదని రెచ్చిపోతున్నారు. 'ఆమె నిజాయితీని ఎవరికీ నిరూపించుకోవాల్సిన పనిలేదు. సిద్దార్థ్‌ శుక్లా కచ్చితంగా షెహనాజ్‌ను ఇలా చూసి సంతోషిస్తాడు', 'సల్మాన్‌, షెహనాజ్‌లకు మధ్య ఏదేదో ఉందని అంటగట్టకండి.

ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం ఉన్నప్పుడు అలాగే ప్రవర్తిస్తారు', 'సిద్దార్థ్‌ లేకపోయినా అతడి ప్రేమ, మద్దతు ఆమెకు ఎల్లప్పుడూ ఉంటాయి', 'నేను సిద్దార్థ్‌ శుక్లా, షెహనాజ్‌ గిల్‌ కోసం నా చివరి శ్వాస వరకు నిలబడతాను, ఈ ప్రపంచమే వారికి వ్యతిరేకంగా నిలబడ్డా సరే నేను మాత్రం వారి వెంటే ఉంటాను', 'నువ్వేం చేసినా జనాలు నీ గురించి మాట్లాడుతూనే ఉంటారు, కాబట్టి నీకు సంతోషాన్ని, ఉత్తమ జీవితాన్నిచ్చే పనులే చేయు షెహనాజ్‌' అంటూ ఫ్యాన్స్‌ షెహనాజ్‌కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: నన్ను సెక్స్‌ స్కామ్‌లో ఇరికించి సోనాక్షిని స్టార్‌ను చేశారు

అతడితో భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా.. మలైకా అరోరా

మరిన్ని వార్తలు