రాజ్‌కుంద్రా కేసు: మౌనం వీడిన శిల్పాశెట్టి.. తప్పుడు వార్తలంటూ ఫైర్‌

2 Aug, 2021 14:20 IST|Sakshi

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. సాక్ష్యాలన్నీ ఆయనను వ్యతిరేకంగా ఉండడంతో అతను జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తన భర్త అరెస్ట్‌పై శిల్పాశెట్టి ఇంతవరకు స్పందించలేదు. తాజాగా ట్విటర్‌ వేదికగా తన భర్త అరెస్ట్‌పై ఒక ప్రకటన విడుదల చేసింది శిల్పా. రాజ్‌కుంద్రా కేసును మీడియా ట్రయల్‌ చేయడం సరికాదని, తన కుటుంబ వ్యక్తిగత స్వెచ్ఛను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఈ వివాదంలోకి త‌న‌ను లాగుతూ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని కోరింది. పోర్న్ రాకెట్ కేసు విచార‌ణ‌లో ఉంద‌ని, ముంబై పోలీసులతో పాటు న్యాయ‌వ్య‌వ‌స్ధ ప‌ట్ల త‌న‌కు పూర్తి విశ్వాసం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఓ కుటుంబంగా తాము న్యాయ‌ప‌ర‌మైన ప‌రిష్కారాల కోసం అన్వేషిస్తున్నామ‌ని, ఓ త‌ల్లిగా త‌మ కుటుంబం, పిల్ల‌ల గోప్య‌త‌ను గౌర‌వించి అర్ధ‌స‌త్యాలు, అస‌త్యాల‌ను ప్ర‌చారం చెయ్యొద్దని శిల్పాశెట్టి విజ్ఞ‌ప్తి చేసింది. 

మరిన్ని వార్తలు