మళ్లీ ప్రేమలో శృతి.. అతడే బాయ్‌ఫ్రెండ్‌!

29 Jan, 2021 13:25 IST|Sakshi

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ ముద్దుల తనయ, టాలీవుడ్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ నటిగా, గాయనిగా మాత్రమే కాకండా, మ్యూజిక్‌ కంపోజర్‌గా, రచయితగా తనకుంటూ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలోనే శృతి వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలంగా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో కొన్నివెబ్‌ సిరీస్‌లు‌ చేసిన ఆమె తిరిగి సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. ఇటీవల మాస్‌ మహారాజా రవితేజతో నటించిన ‘క్రాక్’‌ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లక్‌బస్టర్‌గా నిలిచింది. ‘క్రాక్’‌ హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న శృతి ఇటీవల తన 35వ పుట్టిన రోజును స్నేహితులు మధ్య సెలబ్రెట్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శృతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్‌ చేశారు. దీంతో ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. (చదవండి: 2021లో శృతిహాసన్‌ పెళ్లి?: హీరోయిన్‌ రిప్లై)

అయితే ఇందులో శృతి ఓ వ్యక్తిని హత్తుకుని అత్యంత సన్నిహితంగా కనిపించారు. అంతేగాక ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ ‘నా పుట్టిన రోజును ప్రత్యేకంగా మలచినందుకు ధన్యవాదాలు శాంతను’ అంటూ ట్యాగ్‌ చేశారు. దీంతో ఆ వ్యక్తి శృతి కొత్త బాయ్‌ఫ్రెండ్ అయింటాడని తన ఫాలోవర్స్‌ అంతా అభ్రిప్రాయపడుతున్నారు. అయితే అతడి పేరు శాంతను హజారికా. అతడు ఓ పెయింటర్‌. శృతి బర్త్‌డేను దగ్గరుండి అతడే సెలబ్రెట్‌ చేశాడంట. ఇక అతడిని శాంతను అంటూ శృతి ముద్దుగా పిలవడంతో ఆమె మళ్లీ ప్రేమలో పడ్డారని ఫిక్స్‌ అయిపోతున్నారు. కాగా 2016లో లండన్‌ నటుడు మైఖేల్‌ కర్సెల్‌తో శృతి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019లో వారిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. అప్పటి నుంచి కాస్తా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన శృతి మళ్లీ తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. (చదవండి: శృతి హాసన్‌ గురించి ఇది మీకు తెలుసా?)   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు