సింగర్‌ సునీత కొత్త జర్నీ.. భర్త కోసమేనట

2 Jul, 2021 10:59 IST|Sakshi

Singer Sunitha: గాయనిగా, అనువాద కళాకారిణిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీత త్వరలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇటీవల రామ్‌ వీరపనేనిని రెండవ వివాహం చేసుకుని, వ్యక్తిగతంగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారామె. ఇప్పుడు వృత్తిపరంగా ఓ కొత్త ప్రయాణం ఆరంభించనున్నారని టాక్‌. రామ్‌ డిజిటల్‌ రంగంలో ఉంటూ వెబ్‌ సిరీస్, షోస్‌ చేస్తుంటారు.

సునీతతో ఒక వెబ్‌ సిరీస్‌ నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారట. గతంలో సినిమా (శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘అనామిక’లో ప్రొమోషనల్‌ సాంగ్‌లో కనిపించారు. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు) అవకాశాలు వచ్చినా చేయని సునీత ఈ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సుముఖంగా ఉన్నారట. అయితే నటిగా కాదు.. ఈ సిరీస్‌ నిర్మాణ వ్యవహారాలు చూసుకోనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి.. సునీత కొత్త జర్నీ నటనవైపా? ప్రొడక్షన్‌ వైపా? వేచి చూడాలి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు