-

అన్నదమ్ముల మధ్య ఈగోలు ఉండకూడదు: మంచు మనోజ్‌

26 Nov, 2023 04:28 IST|Sakshi

సంపూర్ణేష్‌ బాబు, సంజోష్,ప్రాచీబంసాల్, ఆరతి గుప్త ప్రధాన తారాగణంగా మన్‌ మోహన్‌ మైనంపల్లి దర్శకత్వంలో చంద్ర చాంగల  నిర్మిస్తున్న చిత్రం ‘సోదరా’. ఈ సినిమాలోని ‘అన్నంటే దోస్తే సోదరా.. సీక్రేట్సే లేవురా..చిన్నోడై పుడితే సోదరా.. జన్మంత జాతర’ అంటూ సాగేపాటను హీరో మంచు మనోజ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘అన్నదమ్ముల మధ్య ఈగోలు, డబ్బు సమస్యలు ఉండకూడదు.

హ్యూమన్స్  ఎమోషన్స్  నేపథ్యంలో ‘సోదర’ సినిమా తీయడం నాకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మంచు మనోజ్‌ నన్ను ఓ సొంత సోదరుడిలా భావించి, ఈ సాంగ్‌ ఈవెంట్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్‌బాబు. ‘‘అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు  మన్‌ మోహన్‌. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సంజోష్, చంద్ర చగంలా. ఈ సినిమాకు సంగీతం: సునీల్‌ కశ్యప్‌. 

మరిన్ని వార్తలు