Mr Pregnant: ఆడవాళ్లు గ్రేట్ సార్.. ఆకట్టుకుంటున్న స్పెషల్ వీడియో గ్లింప్స్

8 May, 2022 13:31 IST|Sakshi

ఆడవాళ్లు చాలా గ్రేట్‌ అంటున్నాడు ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ సోహైల్‌. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

(చదవండి: మహేశ్‌ కోసం ఆ హీరోని పక్కకు పెట్టిన పరశురాం..నెక్ట్స్‌ అతనితోనే మూవీ!)

కాగా, మదర్స్‌డే సందర్భంగా ఆదివారం ఆ చిత్రం నుంచి వీడియో గ్లింప్స్  విడుదల చేశారు మేకర్స్‌. ఈ వీడియో గ్లింప్స్ లో అమ్మ గురించి సుహాసిని, సొహైల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తొమ్మిది నెలల కష్టాన్ని నవ్వుతూ భరిస్తూ ఒక బిడ్డకి జన్మనివ్వడం.అది చావుకు తెగించి... ఈ ఆడవాళ్లు గ్రేట్ సార్ అంటూ సొహైల్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఉద్వేగంగా ఉంది. ఈ చిత్రంలో సోహైల్‌  ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. తుది దశలో ఉన్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు