నీ భ‌ర్త దరిద్రంగా ఉన్నాడు: హీరోయిన్‌కు మెసేజ్‌

18 Sep, 2020 20:00 IST|Sakshi

బాలీవుడ్ స్టార్ కిడ్ సోన‌మ్ క‌పూర్‌పై ట్రోలింగ్స్ కొత్తేమీ కాదు. త‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు ఆమె ధీటైన స‌మాధానాలిస్తారు కూడా! అయితే ఈ సారి సోనమ్‌ను కాకుండా ఆమె భ‌ర్తను టార్గెట్ చేయ‌డంతో ఆమె త‌న స‌హ‌నాన్ని కోల్పోయారు. ఓ అమెరిక‌న్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్.. సోన‌మ్‌ను నెపోటిజం ఉత్ప‌త్తిగా పిలుస్తూ ఘాటు విమ‌ర్శ‌లు చేసింది. అక్క‌డితో ఆగ‌కుండా "నీ భ‌ర్త ఏమైనా హాట్‌గా ఉన్నాడ‌ని ఫీల‌వుతున్నావా? అంత సీన్ లేదు, ఒక‌సారి క‌ళ్లు తెరిచి చూడు, అత‌ను ఎంత ద‌రిద్రంగా ఉన్నాడో" అని రాసుకొచ్చింది. ఈ మెసేజ్ చూసిన‌ సోన‌మ్‌కు కోపం న‌షాళానికంటింది. త‌న వ‌ర‌కు ఏమైనా అంటే ఊరుకునేదేమో కానీ, మ‌ధ్య‌లో త‌న‌ను భ‌ర్త‌ను లాక్కొచ్చినందుకు త‌గిన బుద్ధి చెప్పాల‌నుకున్నారు. ఆమె చేసిన మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేశారు. (చీరకట్టుకు లక్ష రూపాయలు)

"ఈ పోస్ట్ వ‌ల్ల మీకు ఫాలోవ‌ర్లు పెరుగుతారు. ఇదే క‌దా, నువ్వు నా నుంచి ఆశించింది. మ‌న‌సులో అంత ద్వేషం పెట్టుకోవ‌డం మీకంత‌ మంచిది కాదు. నాకు తెలుసు, కేవలం తార‌ల దృష్టిని ఆక‌ర్షించేందుకే ఇలాంటి పోస్టులు చేస్తుంటారు. ఏదైతేనేం, నీ కోరిక నెర‌వేర్చా" అని సోన‌మ్‌ చెప్పుకొచ్చారు. కాగా ఇలాంటి ప్ర‌తికూల మెసేజ్‌ల‌ను అస‌లు ప‌ట్టించుకోకండని ఆమె అభిమానులు సూచిస్తున్నారు. కొంత‌కాలంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉన్న ఈ భామ‌‌ ప్ర‌స్తుతం త‌న భ‌ర్త ఆనంద్‌తో క‌లిసి లండ‌న్‌లో నివ‌సిస్తున్నారు. ఆమె చివ‌రిసారిగా 'జోయా ఫ్యాక్ట‌ర్' సినిమాలో న‌టించారు. (నెటిజన్‌ ట్రోల్‌.. సోనమ్‌ గట్టి కౌంటర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు