రియా.. నిన్ను చాలా మిస్సవుతున్నా: సోనం

5 Mar, 2021 11:47 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనం‌ కపూర్‌ సోదరి, నిర్మాత రియా కపూర్‌ పుట్టిన రోజు నేడు. నేటితో ఆమె 34 వ వసంతంలో అడుగుపెట్టనున్నారు. అయితే, లండన్‌ ఉన్న కారణంగా చెల్లెలు బర్త్‌డేకు తన దగ్గర ఉండలేకపోయానని సోనం భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు, ఇన్‌స్టావేదికగా రియాకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు, తనతో ఉన్న జ్జాపకాలను షేర్‌ చేసుకున్నారు. ఇన్నేళ్ళతో నేను మిస్‌ అయిన తొలి పుట్టిన రోజని రియాతో ఉన్న ఫోటోలను ట్యాగ్‌ చేసింది. ‘హ్యపీ బర్త్‌ డే మై స్వీట్‌ సిస్టర్‌..నువ్వు నా మంచి నేస్తం...లవ్‌యూ సోమచ్‌ డియర్‌’ అని చెప్పింది. ‘‘ నిన్ను ఎంతో మిస్‌ అవుతున్నాను. చిన్నదానివైన నీ సలహలు నేను ఎప్పటికి మరచిపోలేను’’ అని తన మనస్సులోని భావాలను ఇన్‌స్టా వేదికగా పంచుకొంది. కాగా, సోనం ‌కపూర్‌ తన భర్తతో ఆనంద్‌తో కలిసి లండన్‌లో ఉంటుంది.
 

కాగా, వీరి తల్లి సునితా కపూర్‌ నా గారాల పట్టీ రియా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు అని విష్‌‌ చేసింది. ‘నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి’..జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆశీర్వదించింది. ఇక రియా ప్రియుడు కరన్‌ బులానీ కూడా తన ఆమెకు ఇన్‌స్టా వేదికగా బర్త్‌డే విషెస్‌ చెప్పాడు.‌ ఆమెతో  ఉన్న కొన్ని ఫోటోలను జత చేశాడు. ఈ లవ్‌బర్డ్స్‌ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఇన్‌స్టాగ్రా వేదికగా పంచుకున్నారు..కరన్‌‌ బులాని ‘నిన్ను సంతోషంగా ఉంచడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను.. ప్రేమతో నిండిన జన్మదిన శుబాకాంక్షలు ’అని తన ప్రేమను ఎక్స్‌ప్రేస్‌ చేస్తూ లవ్‌ ఎమోజీను షేర్‌ చేశాడు అనిల్‌ కపూర్‌- సునీతా కపూర్‌లకు సోనమ్‌, రియా, హర్షవర్దన్ ముగ్గురు సంతానం. కాగా, సోనమ్‌ చివరిసారిగి ఎకె వర్సెస్‌ ఎకెలో నటించింది. తండ్రి అనిల్‌ కపూర్‌, అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో లీడ్‌ రోల్‌లో నటించింది. తాజాగా బైండ్‌ సినిమాలో కనిపించనున్నారు. దీన్ని షోమ్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

చదవండి: 24 ఏళ్లు.. కానీ 23వ బర్త్‌డే చేసుకుంటా : హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు