Sonam Kapoor: డబ్బుకు ఎక్కువ విలువ ఇవ్వను.. ఎందుకంటే అది నాక్కావాల్సినంత ఉంది!

15 Mar, 2023 12:17 IST|Sakshi

డబ్బు విలువ ఉన్నవాడికంటే లేనివాడికే బాగా తెలుస్తుందంటారు. చెమటోడ్చి సంపాదించే పది రూపాయలు కూడా ఎంతో విలువైనవిగానే భావిస్తుంటారు కష్టజీవులు. కానీ ధనవంతులు మాత్రం తమ దగ్గర ఉన్న కోట్ల రూపాయల ముందు లక్ష రూపాయలు కూడా తక్కువే అని చులకనగా చూస్తారు. తాజాగా బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ డబ్బు గురించి ఉపన్యసించింది. ఆమె చెప్పాలనుకున్నదేంటో కానీ తన దగ్గర మాత్రం బోలెడంత ఉందని డ‍ప్పు కొట్టుకుంది. ఇది చూసి నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు.

డబ్బు ప్రాముఖ్యత గురించి ఆమె మాట్లాడుతూ.. 'మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుండేది. డబ్బుకు ఎక్కువ విలువ ఇవ్వకూడదు అని! ఎందుకంటే అది మాకు కావాల్సినంత ఉంది. కాబట్టి నేనెప్పుడూ డబ్బులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు' అని చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. నాకైతే రూ.65,000 పెద్ద విషయం కాదు. నా డ్రెస్‌ చూస్తే మీకర్థమవట్లేదా డార్లింగ్‌.. అంటూ నవ్వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తనేం చెప్పాలనుకుంది, ఏం చెప్పింది? బోలెడంత డబ్బు మాత్రమే ఉన్న నువ్వు ఎంత పేదదానివో, నీ మాటలు అందరూ వింటారని తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. 

A post shared by enough internet for tonight (@enoughinternetfortonite)

మరిన్ని వార్తలు