సినిమాకు రప్పించడానికే స్టార్లు కావాలి : రాజమౌళి

12 Dec, 2021 00:49 IST|Sakshi

దర్శకుధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీం గత కొద్ది రోజులుగా ప్రమోషన్‌లలో నిమగ్నమయ్యారు. అయితే హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జక్కన్న రాజమౌళికు ఓ విలేకరి నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

అదేంటంటే బాహుబలి తీసినప్పుడు ప్రభాస్‌, రానాలకు వున్న కేజ్‌ వేరు కానీ ఇప్పుడు  ఇద్దరు మాస్‌ హీరోలతో సినిమా చేస్తున్నారు ఇద్దరి ఫాన్స్‌ను ఒకరిని ఎక్కువ తక్కువ కాకుండా సంతృప్తి పరచగలరా అని విలేకరి ప్రశ్నించారు. అయితే దానికి సమాధానంగా నాకు కొన్ని నమ్మకాలుంటాయి.. సినిమాని ప్రేక్షకుడు ఏ విధంగా చూస్తాడు అనే దానిపై కొన్ని క్లారిటీస్‌ వుంటాయి.

అందులో నేను నమ్మే సిద్దాంతం ఏంటంటే..స్టార్‌ వాల్యూ ఏంటో నాకు బాగా తెలుసు. నేను ఇంత పెద్ద డైరెక్టర్‌ అయింది స్టార్స్‌ని ఫాన్స్‌కి, ప్రేక్షకులకి బాగా చూపించే. కానీ ఎంత పెద్ద స్టార్‌ అయినా సరే.. ఎంత మంది స్టార్స్‌ వున్నా సరే.. వాళ్లు ఉత్సాహంగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలరు. ఒకసారి థియేటర్‌లో కూర్చున్న తరువాత ఆ స్టార్‌లు మాయమైపోతారు కథ నడిపించాలి సినిమాని అది నేను బలంగా నమ్ముతాను.

"నేను కారెక్టర్‌లు రాసుకున్నప్పుడు ​సినిమా థియేటర్‌కు ప్రేక్షకులను రప్పించడానికి మెగా పవర్‌ స్టార్‌, యంగ్‌ టైగర్‌ స్టార్స్‌గా కావాలి. కానీ నా పాత్రలు పండించడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టర్లుగా కావాలి. వాళ్ల మధ్య స్నేహాన్ని చూపించగలిగితే జనాలు కూడా ఆ స్నేహానికి రెస్పాండ్‌ అవుతారు తప్ప మెగా పవర్‌ స్టార్‌కి, యంగ్‌ టైగర్‌కి రియాక్ట్‌ అవరని నమ్మాను ఆ నమ్మకంతోనే సినిమా తీసానని సమాధానం ఇచ్చాడు" జక్కన్న.

మరిన్ని వార్తలు