Stand Up Rahul : వినోదాల రాహుల్‌ 

10 Jul, 2021 07:53 IST|Sakshi

రాజ్‌ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. సాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వంలో నందకుమార్‌ అభినేని, భరత్‌ మగులూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రాజ్‌ తరుణ్‌ స్టాండప్‌ కమెడియన్‌గా నటిస్తున్నారు. జీవితంలో దేనికోసమూ కచ్చితంగా నిలబడని ఒక వ్యక్తి నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకుంటాడు. ఆ ప్రేమ కోసం, తన తల్లిదండ్రుల కోసం, స్టాండ్‌ అప్‌ కామెడీ పట్ల ఉన్న అభిరుచి కోసం ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ. వర్ష కూడా స్టాండప్‌ కామెడీ రోల్‌ చేస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సిద్ధు ముద్ద, సంగీతం: స్వీకర్‌ అగస్తి, కెమెరా: శ్రీరాజ్‌ రవీంద్రన్‌.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు