‘స్టార్ మా’ లో నయనతార కొత్త వేషం..!

6 Mar, 2021 13:24 IST|Sakshi

ఆదివారం కోసం స్టార్‌ మా ప్రత్యేక కార్యక్రమాలు

ఆదివారాలు పాజ్ బటన్‌తో వస్తే ఎంత బావుంటుంది అన్నాడో ఆంగ్లేయుడు. కానీ కాలాన్ని మనం ఎలాగూ ఆపలేం. అయితే సమయాన్ని మరపురానిదిగా మలుచుకోవడం మాత్రం మన చేతిలో ఉంటుంది. ‘స్టార్ మా’ ఆదివారాలు ఇదే ఫార్ములాని అనుసరిస్తోంది. ఈ ఆదివారం (7వ తేదీ) సాయంత్రం 6 గంటలకు నయనతార ప్రత్యేక పాత్రలో నటించిన "అమ్మోరు తల్లి" చిత్రాన్ని ప్రసారం చేస్తోంది. ఎన్నో మంచి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నయనతార ముక్కుపుడక అమ్మవారిగా విభిన్నమైన హావభావాలతో కనువిందు చేయబోతోంది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా "అమ్మోరు తల్లి" చిత్రం రాబోతోంది. వినోదానికి కొత్త అర్ధం చెబుతున్న ఈ సంచలన చిత్రం ఓ వినూత్నమైన అనుభూతిని ఇవ్వనుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు "స్టార్ట్ మ్యూజిక్ " షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు "కామెడీ స్టార్స్" చేసే  పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం.. సాయంత్రం నయనతార నట విశ్వరూపం. స్టార్ మా ప్రేక్షకులకు ఈ ఆదివారం వెరీ వెరీ స్పెషల్.

చదవండి: ఆన్‌లైన్ క్లాసులు: షాకైన అమ్మోరు త‌ల్లి

మరిన్ని వార్తలు