సన్నీలియోన్‌ చేతుల మీదుగా 'బాయ్స్‌' టీజర్‌

17 Jul, 2021 09:15 IST|Sakshi

గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాయ్స్‌’. దయానంద్‌ దర్శకత్వంలో మిత్రా శర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని నటి సన్నీ లియోన్‌ విడుదల చేసి, టీజర్‌ బాగుందంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.


ఈ సందర్భంగా హీరోయిన్, నిర్మాత మిత్రా శర్మ మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ అడల్ట్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా ఫస్ట్‌ లుక్‌కి, రాజా హే రాజా.. అనే కాలేజ్‌ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. సన్నీ లియోన్‌ విడుదల చేసిన టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: పడవల బాలచంద్ర.

మరిన్ని వార్తలు