వాట్‌ ఏ జెంటిల్‌మేన్.. ఎన్టీఆర్‌ను కొనియాడిన టీమిండియా బౌలర్

17 Jan, 2023 17:10 IST|Sakshi

జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ టాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ పోటీలో నిలవడంతో యంగ్ టైగర్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా టీమిండియా క్రికెటర్లు సైతం టాలీవుడ్‌ యంగ్ టైగర్‌ను కలిశారు.  న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆటగాళ్లు జూనియర్‌తో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 

చాహల్ తన ట్విటర్‌లో రాస్తూ..' మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలిచినందుకు అభినందనలు. ఇది మనమందరం గర్వపడాల్సిన సమయం.' అంటూ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లో ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. 

మరిన్ని వార్తలు