అజిత్‌ వీరాభిమాని ఆత్మహత్య..

24 Feb, 2021 16:27 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో తలా అజిత్‌ అభిమాని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ప్రకాశ్‌‌ అనే యువకుడు అజిత్‌కు వీరాభిమాని.. అతని ఒంటి నిండ నటుడికి సంబంధించిన పచ్చబొట్టులే ఉంటాయి. అజిత్‌ సినిమాలేవి విడుదలైన ఫస్ట్‌డే ఫస్ట్‌షోనే చూస్తాడు. అంతేగాక అజిత్‌ బయట ఏ ఫంక్షన్‌కు హాజరైనా అందులో ప్రకాశ్‌ ఉత్సాహంగా పాల్గొంటాడు. ఈ క్రమంలో ప్రకాశ్‌ బుధవారం(ఫిబ్రవరి 24) సుసైడ్‌ చేసుకోవడం కోలివుడ్‌లో విషాదం నెలకొంది. అయితే ప్రకాశ్‌ ఆత్మహత్యకు వ్యక్తిగత విషయాలే కారణమని తెలుస్తోంది. అభిమాని సుసైడ్‌ విషయాన్ని అజిత్‌ కుమార్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

‘ఈ రోజు తలా అజిత్‌ వీరాభిమాని, మంచి వ్యక్తిని కోల్పోయాం. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని, అవసరాలు తీర్చాలని స్థానికంగా దగ్గరలో ఉన్న అజిత్‌ ఫ్యాన్స్‌ను కోరుకుంటున్నాం. తమ కుటుంభానికి మా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్‌ చేశారు. కాగా అజిత్‌ అభిమాని ఆత్మహత్య చేసుకోవడంతో మిగతా అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. #RIPPrakash పేరుతో సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అయితే జీవితంలో ఏ సమస్యకూ చావు పరిష్కారం కాదని హితవు పలుకుతున్నారు. సమస్య ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొని అధిగమించాలని సూచిస్తున్నారు. ఇదే చివరి ఆత్మహత్య కావాలని ప్రార్థిస్తున్నారు.

మరిన్ని వార్తలు