పనికిమాలినోడిని చేసుకున్నందుకు గర్వపడుతుంది: థమన్‌

9 May, 2021 19:22 IST|Sakshi

చెడు చెవిలో చెప్పాలి, మంచి మాత్రం నలుగురికీ వినబడేలా చెప్పాలి అంటుంటారు. కానీ సోషల్‌ మీడియా పుణ్యాన మంచి కన్నా చెడునే ఎక్కువగా చాటింపు వేసి చెప్తున్నారు. తప్పున్నా లేకపోయినా ఎదుటివాడిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల మీద సెటైర్లు వేయడం చాలామందికి అదో వినోదంగా మారింది. అయితే ఇలాంటి వాటిని చూసీచూడనట్లుండే సంగీత దర్శకుడు థమన్‌ ఈ మధ్య మాత్రం తన మీద కామెంట్లు చేసేవారిని ఎన్‌కౌంటర్‌ చేసి పడేస్తున్నాడు. 

తాజాగా ఓ నెటిజన్‌ థమన్‌ను అవమానించేలా మీమ్‌ పెట్టాడు. ఇందులో కింగ్‌ సినిమాలో బ్రహ్మానందం చేసిన కాపీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్ర తాలూకు స్టిల్స్‌ ఉన్నాయి. రేప్పొద్దున తన పిల్లలకు ఇతనే థమన్‌ అని చూపిస్తా.. అంటూ సదరు నెటిజన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అతడి ఉద్దేశ్యమేంటో అర్థమైన థమన్‌.. కౌంటర్‌ ఇచ్చిపడేశాడు. 'దయచేసి నీ భార్యకు ఇలా మీమ్స్‌ చేసుకుంటూ ఉన్నానని చెప్పు బ్రో.. అప్పుడామె ఇలాంటి పనికి మాలిన మీమర్‌ను పెళ్లి చేసుకున్నానేంటా? అని చాలా గర్వపడుతుంది' అని రిప్లై ఇచ్చాడు. ఈ దెబ్బకు ఆ నెటిజన్‌ మారు మాట్లాడకుండా గమ్మునుండిపోయాడు. ఎప్పుడూ పక్కవాళ్ల మీద పడి ఏడ్చే ఇలాంటి వాళ్లకు బాగా బుద్ధి చెప్పావంటూ థమన్‌ను అతడి ఫ్యాన్స్‌ ప్రశంసిస్తున్నారు.

చదవండి: రెమ్యునరేషన్‌ పెంచిన తమన్‌.. ఒక్కో మూవీకి ఎంతంటే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు