ఆలస్యంగా పోలింగ్‌.. ఓటర్ల ఎదురుచూపులు..

30 Nov, 2023 08:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో, కొన్నిచోట్ల ఇంకా పోలింగ్‌ ప్రారంభం కాలేదు. 

►కామారెడ్డిలో ఇంకా ప్రారంభం కాని పోలింగ్‌.. 30 నిమిషాలు దాటిన ఇంకా ఓటింగ్‌ ప్రారంభం కాలేదు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. 

►ఈవీఎంల మొరాయింపులపై టెక్నికల్‌ టీమ్స్‌ను అలర్ట్‌ చేస్తున్న సీఈసీ. ఈవీఎంల మొరాయింపులపై మానిటరింగ్‌ చేస్తున్న జాయింట్‌ సీఈవో. ఈవీఎం మొరాయిస్తే టెక్నికల్‌ ఏర్పాటు చేసిన ఈసీ. ఒక్కో సెగ్మెంట్‌కు ముగ్గురు ఇంజనీర్లను నియమించిన ఎలక్షన్‌ కమిషన్‌. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 400 మంది ఈవీఎం టెక్నికల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

► ఎన్నికల విధుల్లో 2.5 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. 

►పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌లో కూడా పోలింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. 

►సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. 

►మెదక్‌ జిల్లా ఎల్లాపురంలో ఇంకా ప్రారంభంకాని ఓటింగ్‌

►ఇక, ఎన్నికల సిబ్బందికి సరైన ‍ట్రైనింగ్‌ ఇవ్వకపోవడంతోనే పోలింగ్‌కు అంతరాయం ఏర్పడిందని పలువురు చెబుతున్నారు.

► మరోవైపు.. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

►రెజిమెంటల్‌ బజార్‌ హైస్కూల్‌లో పనిచేయని ఈవీఎం

►సికింద్రాబాద్..కంటోన్మెంట్ నియోజకవర్గం రెజిమెంటల్ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 209లో పనిచేయని ఈవీఎం. ఇంకా ప్రారంభం కానీ ఓటింగ్ ప్రక్రియ.

►ఓటు హక్కు వినియోగించడానికి ఎదురుచూస్తున్న ఓటర్లు. 

►స్టేషన్‌ఘన్‌పూర్‌లో మొరాయించిన ఈవీఎం

►జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని 117వ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్ ప్రారంభమై 33 నిమిషాలు కావస్తున్నా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు