The Trail Review In Telugu: 'ద ట్రయల్' సినిమా రివ్యూ

24 Nov, 2023 19:26 IST|Sakshi
Rating:  

టైటిల్: ద ట్రయల్
నటీనటులు: స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు తదితరులు
స్టోరీ-దర్శకత్వం: రామ్ గన్ని
నిర్మాతలు: స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు
సంగీతం: శరవణ వాసుదేవన్
విడుదల తేదీ: 2023 నవంబరు 24

జైళ్ల శాఖలో డిప్యూటి జైలర్‌గా గతంలో పనిచేసిన రామ్ గన్ని అనే వ్యక్తి, దర్శకుడిగా తీసిన తొలి సినిమా 'ద ట్రయల్'. తెలుగులో ఫస్ట్ ఇంటరాగేటివ్ మూవీగా దీన్ని తీశారు. స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథేంటి?
అజయ్(యుగ్ రామ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. రూప(స్పందన పల్లి) పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్.ఐగా పనిచేస్తుంటుంది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన మ్యారేజ్. చాలా అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల మధ్య ఓ డైరీ విషయంలో మనస్పర్థలు వస్తాయి. కొన్నాళ్లకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్శరీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ చోటుకి వెళ్తారు. అక్కడ అజయ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపిస్తాడు. అసలు అజయ్‌ చావుకి కారణమేంటి? ఇంటరాగేషన్ అధికారిగా వ్యవహరించిన రాజీవ్(వంశీ), రూపకి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ.

ఎలా ఉందంటే?
థ్రిల్లర్ కథలకు స్టోరీలైన్ చాలా సింపుల్‌గా ఉన్నా.. స్క్రీన్‌ప్లే బోర్ కొట్టకూడదు. అప్పుడే ప్రేక్షకులు కథలో లీనమవుతారు. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ అలానే రాసుకున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు, దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో డైరీ ఆధారంగా, సైకియాట్రిస్ట్, అజయ్ కుటుంబ సభ్యులు ఇచ్చే ఆధారాలను బేస్ చేసుకుని విచారణ కొనసాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాపై అంచనాలను పెంచేలా ఉంటాయి. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే దీన్ని చూసేయొచ్చు. నిడివి కూడా 100 నిమిషాలే.

ఎవరెలా చేశారు?
పోలీసు అధికారిగా స్పందన సరిపోయింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో వంశీ కోటు సీరియస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. అమాయకమైన సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా యుగ్ రామ్ మెప్పించాడు. మిగతా యాక్టర్స్ పర్వాలేదనిపించారు. దర్శకుడు రామ్ గన్ని ఫస్ట్ మూవీతో మెప్పించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు